హిమజ రచ్చ… బిగ్ బాస్3లో అసలేం జరిగింది?

హిమజ రచ్చ... బిగ్ బాస్3లో అసలేం జరిగింది?

0
97

బిగ్ బాస్ లో నిన్న రిలీజైన ప్రోమోని చూస్తుంటే హిమజ పెద్ద రచ్చ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు చాలా కూల్ గా ఉన్న హిమజ ఒక్కసారిగా అంత ఫెరోషియస్ గా ప్రవర్తించేసరికి హౌస్ మేట్స్ అందరూ షాక్ కి గురయ్యారు. అసలు విషయంలోకి వెళ్తే, హిమజ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఆమ్లెట్ తింటుండగా బాబా భాస్కర్ కామెడీగా ఏదో కామెంట్ చేశాడు. బాబానే కాకుండా అక్కడున్న కిచెన్ లో వారు కూడా కామెంట్ చేసినట్టున్నారు.

దాంతో సీరియస్ అయిన హిమజ తింటున్న ప్లేట్ ని విసిరి కొట్టింది. తినేటపుడు ఎందుకు అలా మాట్లాడతారని సీరియస్ అయింది. అక్కడితో ఆగకుండా కిచెన్ లో ఉన్న గుడ్లని కింద పడేసి, నేను తినలేదు కాబట్టి ఎవరూ తినకూడదని వెళ్ళిపోయింది. ఆమె చేసిన ఈ చర్యకి బెడ్ రూంలో ఉన్నవాళ్ళు సైతం లేచి నిల్చున్నారు.
మొదటి నుండి చిన్న చిన్న విషయాలని హార్ట్ కి తీసుకుని బాధపడే హిమజ, ఈరోజు మరింత రెచ్చిపోయిందని తెలుస్తుంది. బిగ్ బాస్ నియమం ప్రకారం హౌస్ లో ప్రాపర్టీ డ్యామేజ్ చేయకూడదు.

హిమజ గుడ్లని పగలకొట్టి ఈ నియమాన్ని అతిక్రమించింది. కంటెస్టెంట్స్ తో ప్రాబ్లమ్ ఉంటే వారితో మాట్లాడాలి. వాళ్ళు వినలేదంటే కెప్టెన్ తో చర్చించాలి. అప్పుడు కూడా వినకపోతే బిగ్ బాస్ కి చెప్పొచ్చు. అవేమీ చేయకుండా తనకి నచ్చినట్టు ప్రవర్తించింది. దీంతో హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ తో వేరు పడిపోయింది. ఇప్పుడు హౌస్ మెంబర్స్ అందరూ ఒకవైపు, హిమజ ఒక వైపు గా అయ్యారు. అసలేం జరిగిందీ తెలుసుకోవాలంటే ఈ రోజు రాత్రి ఎపిసోడ్ చూడాల్సిందే!