హాలీవుడ్ చిత్రాలకు మన ప్రపంచంలో పెద్ద మార్కెట్ ఉంది, అయితే ఇక్కడ ఏ సినిమా నిర్మించినా అది హిట్ అయింది అంటే వరల్డ్ వైడ్ డబ్ అవుతుంది, సినీపరిశ్రమ మొత్తం కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజిల్స్లోని హాలీవుడ్ కేంద్రంగా నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మేటి సినిమాలు అన్నీ ఇక్కడ నుంచి స్టూడియోలో చిత్రీకరించినవే.
అయితే ముందు నుంచి ఇక్కడే ఈ చిత్ర పరిశ్రమ ఉందా అంటే ? కాదు అంటున్నారు చిత్ర అనలిస్టులు, అవును యూఎస్లోనే న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో మాత్రమే చిత్ర పరిశ్రమ ఉండేది. కాని బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ కేసులు వేయడం, తాను తయారు చేసిన పరికరాలు వాడుతూ చిత్రాలు చేస్తున్నారు కనుక పేటెంట్ హక్కులు నాకు ఉన్నాయి.
నగదు చెల్లించాలి అని కేసులు వేయడంతో వారు అందరూ సుమారు 4000 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ హాలీవుడ్ కు వచ్చేశారు.. ఇక అప్పటి నుంచి ఇక్కడే వందలాది సినిమాలు షూట్ అయ్యేవి, ఇక అక్కడ నుంచి ఎడిసన్ వచ్చి కేసులు వేయడానికి లేదు, ఇక్కడ కోర్టులు ఆ కేసులు తీసుకునేవి కావు, అంతేకాదు చాలా సమయం పట్టేది ఈలోగా సినిమాలు వచ్చి వెళ్లిపోయేవి కూడా.