హిట్ సినిమాల యువ దర్శకుడికి బాలయ్య ఛాన్స్ ?

హిట్ సినిమాల యువ దర్శకుడికి బాలయ్య ఛాన్స్ ?

0
106

సీనియర్ హీరోలు ఈ సమయంలో చాలా స్టోరీలు వింటున్నారు, ఈ లాక్ డౌన్ సమయంలో చాలా వరకూ స్టోరీలు ఫైనల్ చేశారు అనే తెలుస్తోంది, యంగ్ హీరోలకి పోటీగా సీనియర్ హీరోలు కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు, అయితే తాజాగా ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

కొత్త దర్శకుడి కథని బాలయ్య ఒకే చేస్తారు అని టాలీవుడ్ లో టాక్స్ నడుస్తున్నాయి..సరిలేరు నీకెవ్వరు చిత్రం మంచి హిట్ కొట్టిన తర్వాత యువ దర్శకుడు ఏ సినిమా ప్రకటించలేదు, ఇక క్లాసికల్ హిట్ ఎఫ్ 3 సినిమా కూడా మరో మూడు నెలల్లో పట్టాలెక్క నుంది.

బాలయ్యకు ఈ లాక్ డౌన్ సమయంలో ఓ స్టోరీలైన్ ను వినిపించారని తెలుస్తోంది, బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అన్నీ కుదిరితే బాలకృష్ణ, అనిల్రావిపూడి వంటి అరుదైన కాంబినేషన్ ను తెరపై చూడొచ్చన్నమాట. అయితే అన్నీ సెట్ అయి బాలయ్య ఒకే చెబితే దసరా రోజు దీనిపై ప్రకటన వస్తుంది అంటున్నారు.