హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది, అయితే ఈ జంట వివాహం తర్వాత హనీమూన్ ట్రిప్ను ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. మాల్దీవుల్లోని అందాలను ఆస్వాదించి, సముద్రపు అందాల నడుమ వీరి ఆనందకర ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు, అయితే ఈ సమయంలో అక్కడ ఆమె భారీగా ఖర్చు చేసింది అని వార్తలు వచ్చాయి
హోటల్లో ఒక్క రాత్రి ఉండాలంటే రూ.38 లక్షలు ఖర్చు అవుతుంది. కాజల్ తన భర్తతో కలిసి 10 రోజులు ఉంది. దీంతో కోట్ల లో ఖర్చు చేశారు అని వార్తలు వినిపించాయి. అయితే ఇందులో వాస్తవం లేదట..పర్యాటక ప్రదేశాలను ప్రమోట్ చేసుకోవడం కోసం సెలబ్రిటీలకు అక్కడ ఫ్రీగా పర్యటించేందుకు అక్కడి ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది.
ఈ సమయంలో ఇన్స్టాగ్రామ్లో రెండు మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే ఈ ఆఫర్ పొందొచ్చు. దీంతో కాజల్ తన హనీమూన్ ట్రిప్ అక్కడ ప్లాన్ చేసింది..సెలబ్రిటీలకు ఖర్చు లేకుండా ఈ ఆఫర్ ఇచ్చారు. ఫ్లైట్ టికెట్లు హోటల్ రూమ్ ఫుడ్ అన్నీ ప్రోవైడ్ చేస్తారట, మొత్తానికి కాజల్ కు ఈ హనీమూన్ ట్రిప్ ఫ్రీగా అయింది అని వార్తలు వస్తున్నాయి.