ఆస్పత్రికి పవన్ కల్యాణ్ – అసలు ఏమైందంటే

ఆస్పత్రికి పవన్ కల్యాణ్ - అసలు ఏమైందంటే

0
89

ఈ కరోనా మహమ్మారి మళ్లీ మన దేశంలో విజృంభిస్తోంది. రోజుకి రెండు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి, ఇక సినిమా పరిశ్రమ కూడా చాలా దారుణంగా దెబ్బతింది.. సెకండ్ వేవ్ దెబ్బకు సినిమాలు కూడా కొత్తవి విడుదల చేయకుండా డేట్ వాయిదా వేసుకున్నారు… చాలా పరిశ్రమల్లో మళ్లీ ఇబ్బంది కనిపిస్తోంది.

 

ఇప్పటికే పలువురు సీఎంలను, కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను.. ఉన్నతాధికారులకు కరోనా సోకింది, అయితే జాగ్రత్తలు తీసుకోపోతే కష్టం అంటున్నారు నిపుణులు. ఇక తాజాగా పవన్ కల్యాణ్ కూడా తన సిబ్బందిలో కొందరికి కరోనా రావడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు…అయితే నిన్నటి నుంచి ఆయనకు కాస్త ఇబ్బంది మొదలైంది.

 

కాస్త అనారోగ్యంగా ఉండటంతో జలుబు దగ్గు లక్షణాలు ఉండటంతో ఆయన ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది..

పవన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.

ఊపిరితిత్తుల్లో స్వల్పంగా ఇన్ఫెక్షన్ గురి అయినట్లు వార్తలు వస్తున్నాయి, అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వైద్యులు చెబుతున్నారు.