కరోనా సమయంలో సెలబ్రిటీలు ఒక ఇంటివారు అవుతున్నారు… ముఖ్యంగా భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు పెళ్లిపీఠలెస్తున్నారు… ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటిరానా ఆగస్ట్ నెలల వివాహం చేసుకున్నాడు..
ఆతర్వాత నిఖిల్, నితిన్ కూడా వివాహం చేసుకున్నాడు… ఇక ఇటీవలే చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా వివాహం చేసుకుంది… త్వరలో నాగబాబు కుమార్తె నిహారిక కూడా పెళ్లిపీఠలెక్కబోతుంది… ఇక వీరి బాటలోనే మరో హీరోయిన్ వచ్చి చేరింది…
బ్రూస్ లీ, ఒంగోలు గిత్త, తీన్మార్ వంటి చిత్రాల్లో నటించిన హీరోయిన్ కృతి కర్బందా కూడా పెళ్లికి రెడీ అంటుందట… కృతి చాలా రోజులుగా సామ్రాట్ అనే బాలీవుడ్ నటుడితో ప్రేమాయణంలో ఉందని ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న వారిద్దరు త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనున్నట్లను వార్తలు వస్తున్నాయి…