ఆచార్య తొలి రోజు ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

0
115

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ చిత్రం ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ ​చరణ్ జతగా పూజాహెగ్డే నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 14న ట్రైలర్ థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను ఆనందపరిచింది. ఇప్పటికే విడుదలయిన ట్రైలర్, టీజర్ మెగా అభిమానులను ఈలలు వేసేలా చేసింది.

భారీ అంచనాలతో ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయి ప్రేక్షకులను సంతోషపెట్టింది.  ఈ సినిమాని దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా తొలిరోజు తెలంగాణ రాష్ట్రాల్లో రూ.40 కోట్ల గ్రాస్, రూ.29.5 కోట్ల షేర్ సొంతం చేసుకుంది.

ఆచార్య పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసి ఉంటే మరిన్ని కలెక్షన్స్ వచ్చేవని బయట టాక్ వినిపిస్తుంది. కర్ణాటక తో పాటు ఇతర రాష్ట్రాల్లో రూ. 1.60 కోట్లు సాధించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.42కోట్లకు పైగా గ్రాస్, రూ.31 కోట్ల షేర్  వసూల్ చేసింది.