కార్తీక దీపం వంటలక్క అంటే రెండు తెలుగు స్టేట్స్ లో తెలియని వారు ఉండరు, వంటలక్క అందరికి బాగా దగ్గర అయింది, ఎప్పుడు డాక్టర్ బాబు వంటలక్కని నమ్మి ఇంటికి తీసుకువెళతాడా అని ఎదురుచూస్తున్నారు అందరూ. ముఖ్యంగా సీరియళ్లు అంటే అబ్బాయిలు అంత చూడరు, కాని యూత్ కూడా ఈ సీరియల్ చూస్తారు.. అందుకే కార్తీక దీపం సీరియల్ అన్నీంటిని దాటి టీఆర్పీలో ముందు ఉంటుంది.
బయట పెద్దగా కనిపించదు ఈ నటి ప్రేమీ విశ్వనాథ్ , ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది, ఈ మధ్య పలు యాడ్స్ కూడా నటిస్తోంది ఈ తార. ప్రేమీ విశ్వనాథ్కు ఎంత ఆస్తి ఉండొచ్చనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
దాదాపు ఆమెకి 30 నుంచి 35 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయని వార్తలు వస్తున్నాయి,29 ఏళ్ల ప్రేమ విశ్వనాథ్ మళయాళంలో వచ్చిన కార్తీక దీపం సీరియల్లో నటించింది.. ఇక్కడ తెలుగులో కూడా ఆమె నటిస్తోంది.ప్రేమీ విశ్వనాథ్ భర్త డాక్టర్ వినీత్ భట్ , ఆయన వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్గా గుర్తింపు పొందారు.