కన్నడ సూపర్‌స్టార్ రాజ్ కుమార్ అంటే అందరిని చాలా ఇష్టం… కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఆయనకు… దేశంలో ఎంతో ఫేమ్ సంపాదించుకున్న నటుడు ఆయన….నటుడు డాక్టర్ రాజ్‌కుమార్‌ను గంథపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఓసారి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే… దేశ వ్యాప్తంగా ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
ఆయన కోసం ప్రభుత్వం కూడా సంప్రదింపులు జరిపింది వీరప్పన్ తో…. ఆయనను విడిపించడానికి కర్ణాటక సర్కారు భారీగా నగదు ముట్టజెప్పిందని ఆనాడు వార్తలు వినిపించాయి..
తాజాగా సమాచార పాత్రికేయుడు శివ సుబ్రమణ్యన్ రాసిన పుస్తకంలో పలు కొత్త అంశాలు వెలుగుచూశాయి.
మొత్తం ఆనాడు రాజ్ కుమార్ విడుదల కోసం కర్ణాటక సర్కారు 15.22 కోట్లను అప్పగించింది అని రాశారు, ఆనాడు ముఖ్యమంత్రి ఎస్‌ఎం.కృష్ణ.. 2000 జూలై 30 రాత్రి గాజనూరు ఫాంహౌస్ నుంచి రాజ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురిని వీరప్పన్ అపహరించాడు చాలా తెలివిగా ఎవరికి తెలియకుండా
సత్యమంగళం అడవిలోకి తీసుకెళ్లాడు. సుమారు 108 రోజులు అక్కడే ఉంచి తర్వాత విడుదల చేశాడు..
ఆయనని విడుదల చేయాలి అని రాష్ట్రంలో అభిమానులు పెద్దఎత్తున ధర్నాలకు దిగారు. రూ.900 కోట్లు విలువచేసే బంగారం, రూ.100 కోట్ల నగదు అందించాలని ముందు డిమాండ్ పెట్టాడట వీరప్పన్.