బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఇటీవల ముగిసింది.. ఇక విజేతగా అభిజిత్ నిలిచారు, 25 లక్షల ఫ్రైజ్ మనీ కూడా గెలుచుకున్నారు. అయితే ఈసారి గత మూడు సీజన్ల కంటే భిన్నంగా సీజన్ 4 జరిగింది అని చెప్పాలి.
అన్నపూర్ణ 7 ఎకర్స్ లో వేసిన ఈ బిగ్ బాస్ హౌస్ సెటప్ కు, గతంలో నిర్మించిన బిగ్ బాస్ హౌస్ లతో పోల్చితే, ఎక్కువ ఖర్చు చేసినట్టు చూస్తుంటేనే తెలుస్తుంది అంటున్నారు బిగ్ బాస్ అభిమానులు.
చాలా కలర్ ఫుల్ గా రిచ్ లుక్ తో డిజైన్ చేశారు, ఇక తర్వాత ఆ సెట్ తీసేస్తారు అనేది తెలిసిందే, ఇక సీజన్ 1పూణేలోని లూనావాల లో సెట్ నిర్మించారు. దాదాపు దీనికి రెండున్నర కోట్లు ఖర్చు అయింది అని వార్తలు వినిపించాయి. ఇక సీజన్ 2 పూణే నుంచి హైదరాబాద్ లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో సెట్ వేశారు.ఇక దీనికి కూడా దాదాపు 2.5 కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలు వినిపించాయి.
అయితే ఇక మూడో సీజన్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే కంటిన్యూ చేశారు. ఈ సారి ఆ స్టూడియో ఓనర్ అయిన నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. సీజన్ 3 హౌస్ సెటప్ కోసం 3.5 కోట్ల వరకూ ఖర్చు అయినట్లు వార్తలు వినిపించాయి. ఇక సీజన్ 4 ఈ సారి హౌస్ సెటప్ కోసం 5 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈసారి కరోనా కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకుని హౌస్ సెటప్ చేశారు.