దేశ వ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రముఖ నటుడు సోనూసుద్ ప్రజల మనస్సు గెలుచుకున్న సంగతి తెలిసిందే..కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉండి పోయారు… దీంతో వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. అలాంటి వారికి సోనూ సుద్ సాయం చేశాడు…
విపత్కర పరిస్థితులో కోరిన కోర్కెను తీర్చి రియల్ హీరోగా అనిపించుకున్నాడు… ఇంకా సాయం చేస్తూనే ఉంటానని చెప్పారు సోనూ… ఇది ఇలా ఉండగా సోనూ సుద్ సహాయం చేసిన ఖర్చు రెండునెలలక్రితమే 10 కోట్లు పైగా ఉంటుందని వార్తలు వచ్చాయి..
ఈ మధ్య పేద విద్యార్థులకు ఆన్ లైన్ చదువుల కోసం ఇంటర్నెట్ మొబైల్ ఫోన్స్ ల్యాప్ టాప్స్ వంటివి కూడా అందించారు అలాగే రైతులకు కూడా సాహాయం అందించారు… ఈ రెండు నెలల కాలంలో మరో 10 నుంచి 15 కోట్లు వరకు అయిందని అంటున్నారు… మొత్తంగా 20 నుంచి 25 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది…
—