బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సరికొత్తగా నడుస్తోంది, అంతేకాదు ఈ దసరా చాలా స్పెషల్ గా నడిచింది, ఆదివారం సమంత హోస్ట్ గా రావడంతో మూడు గంటలు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చారు, అయితే డ్యాన్సులు సాంగ్స్ టాస్కులతో అదరగొట్టారు, అయితే నాగార్జున కంటే టీఆర్పీ ఈ వారం ఎక్కువగా ఉంటుంది అని చాలా మంది భావిస్తున్నారు, అయితే వచ్చే రెండు వారాలు కూడా నాగార్జున రాకపోవచ్చు, మరి హౌస్ కి హోస్ట్ గా ఎవరు వస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
అయితే సమంత సినిమాల్లో హాయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే నటి …మరి ఇప్పుడు ఈ షోకు ఆమె ఎంత పారితోషికం తీసుకున్నారు అనేదానిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి, నాగార్జున కంటే ఎక్కువ రెమ్యునరేషన్ సమంత తీసుకుందనే ప్రచారం జరుగుతుంది.
కేవలం ఐదు ఎపిసోడ్స్ కోసమే ఈమె ఏకంగా 2.10 కోట్లు తీసుకుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆమె ఒక్కో షోకి 40 లక్షలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు, ఇలా సుమారు ఐదు రోజులు షోకు వస్తే ఆమెకి రెండు కోట్ల వరకూ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు, మరికొందరు మాత్రం నాగ్ రెమ్యునరేషన్ లో ఈ ఐదు ఎపిసోడ్ నగదు కట్ చేసి, ఆనగదు సామ్ కు ఇస్తారు అంటున్నారు.