శిల్పాశెట్టికి అసలు రాజ్ కుంద్రా ఎలా పరిచయం ? ఇద్దరికి పెళ్లి ఎలా జరిగిందంటే

How Raj Kundra introduced Shilpa Shetty

0
93

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా గురించి బాలీవుడ్ లో ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడన్న ఆరోపణలు రాజ్ కుంద్రాపై వచ్చాయి. ఇక అతని అరెస్ట్ తర్వాత బాలీవుడ్ కు చెందిన మోడల్స్ బయటకు వచ్చి అతడిపై ఆరోపణలు చేస్తోన్నారు.

హాట్షాట్స్, హాట్హిట్ మూవీస్ లాంటి బీ, సీ గ్రేడ్ యాప్స్ కొన్నింటిలో అశ్లీల చిత్రాలను అప్లోడ్ చేస్తున్నారని పోలీసులు తేల్చారు. వ్యాపారవేత్తగా ఉన్న రాజ్ కుంద్రా అసలు ముందు రోజుల్లో ఏం చేసేవారు? ఎలా రాజ్ కుంద్రా బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నారు అనేది ఇప్పుడు అందరూ తెగ సెర్చ్ చేస్తున్నారు.

రాజ్ కుంద్రాకు శిల్పాశెట్టి రెండవ భార్య. మొదటి భార్య నుంచి విడిపోయిన రాజ్ కుంద్రా. తన మొదటి భార్యకు ఆమె బావతో అక్రమ సంబంధం ఉండటంతో విడాకులు తీసుకున్నా అని చెప్పాడు. రాజ్ కుటుంబం ఇండియా నుంచి చిన్నతనంలో లండన్ కు వలస వెళ్లింది. 18 ఎళ్ల వయసులో రాజ్ కుంద్రా నేపాల్ కు వచ్చి అక్కడ శాలువాల బిజినెస్ మొదలు పెట్టాడు.
ఆ శాలువాలు బ్రిటన్కు చెందిన ఫ్యాషన్ హౌజ్ కి అమ్మడం మొదలు పెట్టాడు.

ఇలా వ్యాపారం పెరిగింది కోట్లు ఆర్జించాడు.2007 దుబాయ్కు వెళ్లి అక్కడ కన్ స్ట్రక్షన్ వ్యాపారం చేశాడు . అలాగే పలు స్పోర్ట్స్ బిజినెస్, లైవ్-బ్రాడ్కాస్ట్, గేమింగ్ వ్యాపారాలు చేశాడు. ఇక్కడతో వ్యాపారవేత్తగా కోట్లు ఆర్జించాడు .2009లో నటి శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నాడు. ఇక కామన్ ఫ్రెండ్ ద్వారా శిల్పాని ముందు రాజ్ కలిశాడు. ఇలా ఆమెకి ఖరీదైన గిఫ్టులు ఇచ్చేవాడట. మొత్తానికి అతను చూపించే ప్రేమకి ఆమె ఫిదా అయింది ఇద్దరూ వివాహం చేసుకున్నారు.