ఆర్యన్ ఖాన్ కు హృతిక్ రోషన్ మద్దతు..వైరల్ గా మారిన ఇన్‌స్టా పోస్ట్

Hrithik Roshan Supports Aryan Khan In Viral Insta Post

0
86

డ్ర‌గ్స్ కేసులో అరెస్ట‌యిన షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్‌కు హృతిక్ రోషన్ మ‌ద్ద‌తుగా నిలిచాడు. ఈ సందర్బంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు హృతిక్. ప్ర‌శాంతంగా ఉండు..ప్ర‌తి అనుభ‌వం నుంచి నేర్చుకో..ఈ క్ష‌ణాలే నీ రేప‌టిని త‌యారు చేస్తాయని ఆర్య‌న్‌కు ధైర్యం చెబుతూ హృతిక్ చేసిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

జీవితం ఓ వింత ప్ర‌యాణంలాంటిది. అది అస్థిర‌మైన‌ది. ఇప్పుడు నీకొచ్చిన క‌ష్టం చూసి తీవ్ర ఒత్తిడికి గుర‌వుతున్నావ‌ని తెలుసు. కోపం, అయోమయం, నిస్స‌హాయ స్థితిలో ఉన్నావు. వీటినే జ్వ‌లింప‌జేసి నీలోని హీరోని బ‌య‌ట‌కు తీసుకురావాలి.

నువ్వు ఏది గుర్తుంచుకోవాలి. ఏది వదిలేయాలి అనుకుంటావో దానిని బ‌ట్టి త‌ప్పులు, వైఫ‌ల్యాలు, విజ‌యాలు అన్నీ స‌మాన‌మే అని ఆర్య‌న్‌కు ధైర్య వ‌చ‌నాలు చెబుతూ పెద్ద పోస్టే పెట్టాడు హృతిక్ రోష‌న్‌. ఇంత‌కుముందు హృతిక్ మాజీ భార్య సుజానే ఖాన్ కూడా ఆర్య‌న్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడిన విష‌యం తెలిసిందే.