ఎఫ్2 చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.. ఇప్పుడు ఎఫ్ 3 కి ప్లాన్ చేస్తున్నారు, చిత్రం పై ప్రకటన వచ్చేసింది, విక్టరీ వెంకటేష్ హీరో వరుణ్ తేజ్ మరోసారి సందడి చేసేందుకు సిద్దం అవుతున్నారు, ఎఫ్ 2 సక్సెస్ అవ్వడంతో ఎఫ్ 3 పై వెంటనే కీలక ప్రకటన వచ్చింది, ఇక పలు సినిమాలు సెట్స్ పై ఉండటం అలాగే కరోనా లాక్ డౌన్ తో దీనికి బ్రేకులు పడ్డాయి.
తాజాగా ఈ సినిమా సంక్రాంతి తర్వాత షూటింగ్ కు రానుంది, అయితే దర్శకుడు అనిల్ రావిపూడి నెక్ట్స్ ఈ సినిమా పైనే వర్క్ చేయనున్నారు, అయితే ఈసారి భారీ బడ్జెట్ తో రూపొందుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
దాదాపు రెమ్యునరేషన్లే 60 శాతం వరకూ ఉన్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి, విక్టరీ వెంకటేష్ కు 12 కోట్లు వరుణ్ కు దాదాపు 7 నుంచి 8 కోట్లు, అలాగే దర్శకుడు అనిల్ కు 10 కోట్లు ఇక హీరోయిన్లకు ఇద్దరికి కలిపి 5 కోట్ల వరకూ అవుతుందని టాక్ ..మొత్తానికి సినిమా బడ్జెట్ 80 కోట్ల వరకూ ఉంటుంది అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.