ప‌వ‌న్ సినిమా కోసం భారీ డీల్ ? టాలీవుడ్ టాక్

Huge deal for pawan kalyan new movie

0
78

ఓటీటీ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ క‌రోనా స‌మ‌యంలో చాలా సినిమాలు ఓటీటీలో విడుద‌ల అవుతున్నాయి. బడా సంస్థలు ఈ రంగంలోకి అడుగు పెట్టడంతో పోటీ పెరిగింది. ఇక సినిమా హ‌క్కుల కోసం భారీ డీల్స్ చేసుకుంటున్నారు నిర్వాహ‌కులు. తాజాగా ఓ వార్త అయితే వినిపిస్తోంది ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటే ఎంత ఎక్స్ పెక్టేష‌న్స్ ఉంటాయో తెలిసిందే , అభిమానులు ఆయ‌న సినిమా కోసం ఎదురుచూస్తారు.

తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లా నాయ‌క్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకునేందుకు అమెజాన్‌ ప్రైమ్‌ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఏకంగా రూ. 15 కోట్లు పెట్టనుందని టాలీవుడ్ టాక్. అయితే ఈ చిత్రం థియేట‌ర్ల‌లో వ‌చ్చిన త‌ర్వాత నెల రోజుల‌కి అమెజాన్ లో విడుద‌ల అవ్వ‌చ్చు అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటే స‌రికొత్త రికార్డులు న‌మోదు అవుతాయి. ఆయ‌న సినిమా కోసం ఓటీటీ సంస్ధ‌లు భారీ డీల్స్ కు సిద్దం అవుతున్నాయి. మలయాళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన
అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు తెలుగులో భీమ్లా నాయక్‌ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రానా లు న‌టిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్‌, నిత్య మీనన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.