ఈ చిత్రంలో హీరో రాజశేఖర్ కి భారీ రెమ్యున‌రేష‌న్ ?

Huge remuneration for hero Rajasekhar in this film?

0
88
????????????????????????????????????

హీరో రాజశేఖర్ కి టాలీవుడ్ లో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆయ‌న‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆయ‌న న‌ట‌న అద్బుతం ఆయ‌న సినిమాలు అన్నీ సూప‌ర్ హిట్ నిర్మాత‌ల‌కు క‌న‌క వ‌ర్షం కురిపించేవి .ఇక ఆల్ టైం మ్యూజిక‌ల్ హిట్స్ ఎన్నో ఉన్నాయి ఆయ‌న సినిమాల్లో. అయితే ఇప్పుడు ఆయ‌న చాలా డిఫ‌రెంట్ క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నారు.

గరుడ వేగతో మంచి స‌క్స‌స్ అందుకున్నారు త‌ర్వాత క‌ల్కీతో అద‌ర‌గొట్టారు డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ . ఇక తాజాగా శేఖ‌ర్ అనే సినిమాని ప్ర‌క‌టించారు. తాజాగా గోపీచంద్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. గోపీచంద్ హీరోగా డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా వ‌స్తోంది. అందులో ఆయ‌న న‌టించ‌నున్నారు అని టాలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం రాజశేఖర్ కి భారీ రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నార‌ట‌. సుమారు 3 కోట్ల రూపాయ‌లు ఉంటుంది అని తెలుస్తోంది. ఈ మూవీలో హీరో సోదరుడి పాత్ర చాలా కీలకం. ఆయ‌న ఈ పాత్ర చేయ‌బోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.