కీర్తి సురేష్ టాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. అయితే ఫామ్ లో ఉన్న హీరోయిన్లు అంత తొందరగా సిస్టర్ పాత్రలు చేయడానికి ఒప్పుకోరు కాని కీర్తి సురేష్ మాత్రం ఈ సినిమాలకు ఒకే చెప్పింది. దానికి కారణం కూడా ఉంది ఎందుకంటే ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి చిత్రం, అంతేకాదు ఎంతో గొప్ప పాత్ర కావడంతో ఆమె ఒకే చెప్పింది.
భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించనుంది. అయితే ఈ సినిమా కన్నా ముందే అన్నాత్తేలో సూపర్ స్టార్ రజనీకాంత్ కి కూడా సిస్టర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలు రెండూ ఇటు సూపర్ స్టార్ మెగాస్టార్ సినిమాలు అందుకే ఆమె ఒకే చేశారు. అయితే ఆమె కి మెగాస్టార్ సినిమాలో భారీ రెమ్యునరేషన్ వస్తుంది అని టాలీవుడ్ టాక్ .
ఈ రెండు సినిమాల్లోనూ కీర్తి క్యారెక్టర్ చుట్లూ కథ అంతా తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రేంజ్ లోనే పేమెంట్ అందుకుంటున్నారట . గతంలో హీరోయిన్ గా చేసిన రోల్స్ కంటే ఇప్పుడు సిస్టర్ రోల్ కి డబుల్ పేమెంట్ అందుకుంటున్నారని టాలీవుడ్ టాక్ .మరో వైపు హీరోయిన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట సినిమాలో నటిస్తోంది కీర్తి.