భర్త అరెస్ట్ పై యాంకర్ శ్యామల ఏమన్నారంటే

భర్త అరెస్ట్ పై యాంకర్ శ్యామల ఏమన్నారంటే

0
91

బుల్లితెర యాంకర్ శ్యామల అంటే తెలియని వారు ఉండరు… తాజాగా ఆమె భర్త నరసింహారెడ్డిని రాయ్ దుర్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు…. ఓ యువతి దగ్గర కోటీ రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది.. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు…అరెస్ట్ తర్వాత నరసింహారెడ్డి ని రిమాండ్ కి పంపారు.

 

 

ఈ కేసులో మరో మహిళను కూడా అరెస్టు చేశారు. ఆమె వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే తాజాగా ఈ ఘటనపైయాంకర్ శ్యామల స్పందించారు నిజం బయటకు రానివ్వండి అని తెలిపారు ఆమె,

మేం నా అత్తగారి ఊరి నుండి హైదరాబాద్ చేరుకున్నాం…. కాస్త జ్వరంగా ఉంది, సోమవారం ఆయన ఇంటికి కూడా రాలేదు.. ఏదైనా పని ఉండి రాలేదు అనుకున్నాను, ఈ కేసులో అరెస్ట్ అయ్యారు అని తెలిసింది.

 

 

ఇక ఆయన గురించి నాకు బాగా తెలుసు మాకు వివాహం అయి పది సంవత్సరాలు అయింది, ఆయన ఏ మహిళతోనూ అసభ్యంగా ప్రవర్తించరు, నిజాలు ఇంకా బయటకు రానివ్వండి, ప్రాధమిక విషయాలతోనే తన భర్తని తప్పుగా చూపించవద్దు అని మీడియాని ఆమె కోరారు .