బాలీవుడ్ నటుడు సోనూ సూద్ లాక్ డౌన్ వేల తన మానవత్వాన్ని చాటుకుంటున్న సంగతి తెలిసిందే… లాక్ డౌన్ తో కార్మికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు… ఇబ్బందిపడుతున్న వారిని గుర్తించి సోనూ సూద్ వారిని స్వస్థలాలకు చేర్చుతున్నారు… అలాగే ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు కూడా సహాయం చేస్తున్నారు…
ఇటీవలే వలస కార్మికుల కోసం ఒక స్పెషల్ ఫ్లైట్ కూడా బుక్ చేశాడు… ఈ క్రమంలో ఆయన్ను పలువురు అభినందిస్తుండగా మరికొందరు విచిత్రమైన కోరికలు కోరుతున్నారు… తాజాగా ఒక మహిళ సోనూ సూద్ ను అలాంటి ప్రశ్న అడిగింది… తన భర్తతో కాపురం చేయలేకపోతున్నానని తన భర్త నుంచి వేరుపడేందుకు సాయం చేయాలంటూ సుష్రియా ఆచార్య అనే యువతి తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోనూ సూద్ ను కోరింది..
జనతా కర్ఫ్యూ నాటి నుంచి భర్తతోనే కలిసి ఉంటున్నానని ఇప్పుడు అతన్ని బయటకు పంపాలని లేదా తనను తల్లిదండ్రుల వద్దకు పంపాలని ఆమె కోరింది… అయితే ఇందుకు సోనూ సమాధానం ఇస్తూ తన వద్ద ప్లాన్ ఉందని దాన్ని పాటించాలని సూచించాడు… నా దగ్గర ఓ ప్లాన్ ఉందని మీ ఇద్దరిని గోవాకు పంపుదాం ఏమంటారు.. అని ట్వీట్ చేశారు..
—