హైదరాబాద్ లో స్టూడెంట్ కు కాజల్ అగర్వాల్ సాయం

హైదరాబాద్ లో స్టూడెంట్ కు కాజల్ అగర్వాల్ సాయం

0
95

చందమామ కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఆమె ఆచార్య సినిమాలో కూడా నటించారు… అయితే ఆమె తాజాగా ఓ స్టూడెంట్ కు సాయం చేశారు.. ఆ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది, మరి అందాల తార కాజల్ ఏం సాయం చేశారు అనేది చూస్తే.

 

హైదరాబాద్ కు చెందిన సుమ అనే ఎంఫార్మసీ స్టూడెంట్ చదువును కొనసాగిస్తూనే ఉద్యోగం కూడా చేస్తోంది. కాని లాక్ డౌన్ వల్ల

ఆమెకి ఉద్యోగం పోయింది… దీంతో ఆమె సోషల్ మీడియాలో తన బాధ చెప్పుకుంది… తాను ఎంఫార్మసీ చదువుతున్నానని, ఈమధ్యే తన జాబ్ పోయిందని తెలిపింది. తాను పరీక్ష రాయాలి అంటే 83 వేల ఫీజు కట్టాలి అని తెలిపింది.

 

ఈ ఫీజు కట్టకపోతే పరీక్షకు అనుమతి ఉండదు అని తన బాధ చెప్పుకుంది… మొత్తానికి ఈ విషయం కాజల్ కు తెలిసింది… వెంటనే కాజల్ తన టీమ్ ద్వారా ఇందులో నిజం ఏమిటి అనే వివరాలు అడిగి తెలుసుకుంది… వారి టీమ్ చెప్పడంతో ఆమెకి 1 లక్ష రూపాయల సాయం చేసింది, ఆమె చేసిన సాయానికి నెటిజన్లు అందరూ ఆమెని అభినందిస్తున్నారు.