వేణుమాధవ్ మృతి పై హైపర్ ఆది వ్యాఖ్యలు..!!

వేణుమాధవ్ మృతి పై హైపర్ ఆది వ్యాఖ్యలు..!!

0
87

నిన్న అనారోగ్యంతో మృతి చెందిన హాస్యనటుడు వేణుమాధవ్ అంతిమ యాత్ర పూర్తయింది.. కమెడియన్ గా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన వేణు మాధవ్ ని కడసారి చూసేందుకు అభిమానులు సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ చేరుకొని పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు.. ఆయనతో తమ అనుబంధం గురించి గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు.

అందులో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా ఉన్నాడు. తాజాగా ఈయన కడసారి చూపుకు వచ్చిన ఆది.. వేణు మాధవ్‌తో తనకున్న అనుబంధం గురించి మీడియాతో పంచుకున్నాడు. తనకు వేణు అన్న ఎప్పట్నుంచో పరిచయమని.. మేమంతా జబర్దస్త్‌లో బాగా నవ్విస్తున్నామని ఫోన్ చేసి చెప్పేవాడని గుర్తు చేసుకున్నాడు.