స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” గురువారం థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది. నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.
ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలయి పాజిటివ్ టాకుతో దూసుకుపోవడంతో మహేష్ అభిమానులందరికి ట్వీట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ యూఎస్ లో ఓ బ్యాంక్ లో రికవరీ ఎంప్లాయ్‌గా కొత్త లుక్ లో కనబడి ప్రేక్షకులను అబ్బురపరిచిన ఈ సినిమా సక్సస్ కు చిత్రబృందం కూడా కారణమని ట్వీట్ ద్వారా తెలియజేసారు.
అంతేకాకుండా ” మీరు చూపించే అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.. ఇంతటి గొప్ప సక్సెస్ సాదించటానికి అభిమానుల ప్రేక్షాదరణ కారణమని చెప్పుకొచ్చారు. సర్కారు వారి పాట ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉండిపోతుంది.” అని మహేష్ బాబు ట్వీట్ చేయడం జరిగింది. ప్రేక్షకులందరూ ఊహించిన విధంగానే ఈ సినిమా భారీ విజయాన్ని తమ ఖాతాల్లో వేసుకుంది.