నేను పబ్లిక్ ప్రాపర్టీని కాదు: తాప్సీ ఫైర్

-

తాప్సీ పన్ను(Taapsee Pannu) ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ పరిశ్రమలో అంతగా రాణించలేకపోయినా బాలీవుడ్‌లో మాత్రం తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నటి ఈమె. తాజాగా తాప్సీ తనకు ఫొటో గ్రాఫర్లకు ఉన్న వివాదంపై క్లారిటీ ఇచ్చింది. ‘నేను సెలబ్రిటీనే కానీ పబ్లిక్ ప్రాపర్టీని కాను. ఈ రెండిటి మధ్యా చాలా తేడా ఉంది. ఆ తేడా నాకు చాలా బాగా తెలుసు. ఒక సెలబ్రిటీని పబ్లిక్ ప్రాపర్టీ తరహాలో చూస్తే కుదరదు. ప్రతి ఒక్కరికీ తమ పర్సనల్ ప్రిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. పబ్లిక్ ప్రాపర్టీలో ఫొటో దిగడం, తీయించుకోవడం కొందరికి నచ్చొచ్చు. కానీ నాకు నచ్చదు. నాకు ఏం కావాలి అన్నది నాకు తెలుసు’’ అంటూ ఘాటుగానే చెప్పింది తాప్సీ.

- Advertisement -

‘‘నాపై ఎవరైనా అరిస్తే నేను అస్సలు ఊరుకోను. అక్కడిక్కడే తిరిగి సమాధానం ఇచ్చేస్తా. అలాంటిది కెమెరాలతో నాపైకి దూసుకురావడం, ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం ఏంటి? దాన్ని నేను ఎలా సహిస్తాను. అది సరైన పద్దతి కూడా కాదు. నేను మొదల అమ్మాయిని.. ఆ తర్వాతే నటిని. నేనిలా చెప్తుంటే ఈ ప్రొఫెషన్‌కి నేను సరిపోను అని మీరు అనుకోవచ్చు. అది నా సమస్య కాదు. ఏదిఏమైనా నటన అనేది నాకు నచ్చిన ప్రొఫెషన్. అందుకే ఇంకా కొనసాగుతున్నా’’ అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అమ్మడి(Taapsee Pannu) కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read Also: ప్రభాస్ పై అర్షద్ వ్యాఖ్యలు.. నాగ్ అశ్విన్ పవర్ ఫుల్ రిప్లై
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...