తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల రాజకీయ పార్టీ పెడతాను అని తెలిపారు, అయితే ఆయన అనారోగ్యం పాలవ్వడంతో ఇక రాజకీయ పార్టీ పెట్టడం లేదని రాజకీయాల్లోకి రావడం లేదు అని తెలిపారు
అంతేకాదు తాను రాజకీయాల్లోకి రాకుండా ప్రజాసేవ చేస్తాను అని తెలిపారు.
ఇక రజనీ అభిమానులు ఈ విషయంలో చాలా బాధలో ఉన్నారు..అభిమానులకు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ క్షమాపణలు తెలిపాడు.. రజనీకాంత్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూడాలి అని లారెన్స్ మాట్లాడాలి అని అభిమానులు కోరుతున్నారు.
లారెన్స్.. తాను ఆ పని చేయలేనని, తనను క్షమించాలని అభిమానులను వేడుకున్నాడు. ఆయన అనారోగ్యంతో రాను అని చెప్పారు, నేనూ బాధపడుతున్నాను అని తెలిపారు. మన వల్ల ఆయన రాజకీయాల్లోకి వచ్చినా మళ్లీ అనారోగ్యం పాలైతే మనం బాధపడాలి అని తెలిపారు ఆయన.