సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి నిలదొక్కుకోవడం అంటే అది మాములు విషయం కాదు.. అలా టాలీవుడ్ లో నిలదొక్కుకున్న వారిలో మంచి ఫేమ్ సంపాదించిన వారిలో ముందు మెగాస్టార్ చిరంజీవి పేరు చెబుతారు, ఆయన నటన డ్యాన్సులతో టాలీవుడ్ లో ఓ కొత్త ఒరవడిని తీసుకువచ్చారు.
తెలుగు సినీ పరిశ్రమకు ఆయన పెద్దదిక్కుగా ఉన్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా సినిమాల్లో ఆయన కొనసాగుతున్నారు.. తాజాగా సమంత హోస్ట్గా నిర్వహిస్తున్న సామ్ జామ్ షోలో పాల్గొన్న ఆయన కెరీర్, వ్యక్తిగత జీవితం, రాజకీయాల గురించి అనేక విషయాలు చెప్పారు. ఇక ఓసారి సినిమా ప్లాప్ అయింది అని వెక్కి వెక్కి ఏడ్చాను అని చెప్పారు ఆయన.
ఖైదీ సినిమా 1983లో రిలీజైంది. ఈ సినిమా నా జీవితాన్ని మలుపు తిప్పింది, తర్వాత 1986 లో వేట సినిమా వచ్చింది..కాని ఇది ప్లాప్ అయింది, దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నాను.. కాని ఇది చాలా బాధ కలిగించింది…ఆ బాధను తట్టుకోలేక ఇంట్లో దుప్పటి కప్పుకుని వెక్కివెక్కి ఏడ్చాను. ఈ బాధ నుంచి బయటకు రావడానికి నాకు కొద్ది రోజుల సమయం పట్టింది అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.