నన్ను అలా పిలిస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు – తమన్నా

-

అభిమానులు హీరోలని హీరోయిన్లని ఎంతో ముద్దుగా బిరుదులతో పిలుస్తూ ఉంటారు, ఆ పేర్లు వారికి అభిమానులే పెడతారు కూడా… ముద్దుగా ఇష్టంతో ప్రేమతో వాటితోనే పిలుస్తారు సోషల్ మీడియాలో కూడా అభిమానుల ఇలాంటి కామెంట్లే పెట్టి తమ అభిమానం చూపించుకుంటారు, అయితే టాలీవుడ్ లో అందాల తార తమన్నాకు కూడా మంచి నేమ్ ఉంది ఆమెని అభిమానులు ముద్దుగా మిల్కీ బ్యూటీ అంటారు.

- Advertisement -

ఆ పేరుతోనే ఆమెని పిలుస్తారు, ఇక ఆమె గురించి మాట్లాడినా రాసినా మీల్కీ బ్యూటీ అని రాస్తారు, కాని తమన్నాకు ఈ బిరుదు ఇష్టం లేదట, దీనికి కారణం కూడా చెబుతోంది తమన్నా,ఫ్యాన్స్ ప్రేమతోనే అలా పిలుస్తున్నారు. అది నాకు తెలుసు. కానీ, ఆ పేరు నాకు నచ్చదు.

ఎందుకు అంటే, మేని ఛాయను బట్టి ఇలా పేర్లు పెట్టడం తప్పనే చెప్పాలి. మన దేశంలో చాలా మందికి ఇలా తెల్ల శరీరం పట్ల ఆకర్షణ వ్యామోహం ఉంది, ఇది మంచిది కాదు అందుకే అలా పిలవడం నాకు ఇష్టం లేదు అని చెబుతోంది ఈ భామ, ఇలా కాకుండా ప్రతిభను బట్టీ ఇస్తే బాగుంటుంది అని తెలిపింది తమన్నా.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | పాక్‌తో ఎప్పుడూ నమ్మకద్రోహమే: మోదీ

భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల...

MLC Kavitha | 13 వేల మంది ఇన్‌వ్యాలిడ్‌ ఎలా అయ్యారు: కవిత

గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు...