టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా, బాలీవుడ్‌లో సైతం మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ సమంత(Samantha). కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో మయోసైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు దాదాపు ఏడాది కాలం దూరమైందీ అమ్మడు. సాధారణంగా ఒక హీరోయిన్ సినిమాలకు ఏడాది పాటు దూరమైతే.. వాళ్ల కెరీర్ ఫినీష్ అయిపోయిందని అందరూ అనుకుంటారు. కానీ సమంత మాత్రం అందుకు పూర్తి అపోజిటింగ్ నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్‌లో కంబ్యాక్ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. వచ్చీ రాగానే ‘సీటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌తో యాక్షన్‌లోకి దిగేసింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో దూసుకుపోతోంది సమంత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మయోసైటిస్ వల్ల తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పింది. తన వ్యాధి గురించి సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయంశంగా మారాయి.
‘‘సిటాడెల్: హనీ బన్నీ’ సినిమా షూటింగ్ సమయంలో మయోసైటిస్ చాలా ఇబ్బంది పెట్టింది. ఒకరోజు ఒక్కసారిగా అంతా మర్చిపోయా. నాకేమీ గుర్తు లేదు. చాలా మంది పేర్లు కూడా గుర్తుకు రాలేదు. షూటింగ్ కోసం వేసిన సెట్ టైమ్ ఇంకా ఒక్కరోజే ఉంది. కానీ నాకు ఏమీ గుర్తు లేదు. ఎవరెవరో వస్తున్నారు. ఏదేదో చెప్తున్నారు. వెళ్తున్నారు. నా ముందే స్టంట్ మాస్టర్ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో.. నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. అంతా అయోమయంగా ఉంది. ఇప్పటికి కూడా ఆ పరిస్థితి గుర్తు చేసకుంటే.. అప్పుడు నన్నెవరూ ఆపుపత్రికి తీసుకెళ్లలేదని, నా ఆరోగ్యం గురించి అడగలేదని అనుకుంటాను. కానీ ‘సిటాడెల్’ టీమ్ ఎంతగానో సహకరించింది’’ అని సమంత(Samantha) తెలిపింది.