సింగర్ సునీత టాలీవుడ్ లో ఆమె పాటలకు అందరూ అభిమానులే… ఆమె పాట పాడారు అంటే అలా వినాలనిపిస్తుంది ఆమె గాత్రం… ఎంతో మంది హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పారు సునీత.. కొన్ని వేల పాటలు పాడారు ముఖ్యంగా టాలీవుడ్ లో ఏ ఫిమేల్ సింగర్ కు లేని ఫాలోయింగ్ ఆమెకి ఉంది.ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
ఇక ఆమెకు హీరోయిన్ గా కూడా పలు అవకాశాలు వచ్చాయి అనే విషయం చాలా మందికి తెలియదు, ఆమెని టాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలు దర్శకులు హీరోయిన్ గా సినిమాలు చేయమని కోరారట… కాని ఆమె వాటికి నో చెప్పారు.
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సునీతకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. కాని ఆమె హీరోయిన్ గా మారితే కష్టాలు ఉంటాయని, వాటిని దగ్గర నుంచి చూశానని అందుకే తనకు వద్దు అని ఆ అవకాశం వదిలేశారట.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన అనగనగా ఒక రోజు సినిమాలో కూడా హీరోయిన్గా అవకాశం ఇచ్చారు, కాని ఆమె దీనికి నో చెప్పారు, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత ఈ విషయాలు పంచుకున్నారు.. . ఇక ఆమె అభిమానులు మాత్రం మీరు నిజంగా సినిమాలు చేసి ఉంటే మీ పాటలు మిస్ అయ్యే వాళ్లం అని అంటున్నారు.