సినిమా చెట్టు బతికితే పెద్ద సినిమా తీస్తా.. డైరక్టర్ వంశీ

-

గోదావరి గట్టున ఉన్నసినిమా చెట్టు(Cinema Chettu) ఇటీవల నేలకొరిగింది. ఈ చెట్టుతో తమకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయని అక్కడి స్థానికులు చెప్పారు. ఆ చెట్టుతో అనుబంధం స్థానికులకే కాదు తనకు కూడా ఉందంటున్నారు దర్శక రచయిత వంశీ(Director Vamsi). ఈ చెట్టుతో తనకున్న అనుంబధాన్ని మాటల్లో చెప్పలేనని, ఈ చెట్టు కింద ఎన్నో సినిమా షూటింగ్ చేశానంటూ గుర్తు చేసుకున్నారు. ఈ చెట్టు నేలకొరగడాన్ని జీర్ణించుకోలేకున్నానని, ఈ వార్త గుండెల్ని పిండేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేలకొరిగిన సినిమా చెట్టును సందర్శించడానికి ఆయన కొవ్వూరు వెళ్లారు. ఈ సందర్భంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

‘‘ఈ చెట్టును బతికించుకోవాలి. ఈ నిద్రగన్నేరు చెట్టు బతికితే ఇక్కడ మళ్ళీ పెద్ద సినిమా తీస్తాను. రోటరీ క్లబ్‌తో పాటు ప్రవాసాంధ్రులు, దాతలు చెట్టును బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని కోరుకుంటున్నా. పునరుజ్జీవంతో ఈ చెట్టు తన పూర్వస్థితికి వస్తే సంతోషించే వారిలో నేను ప్రథముడిగా ఉంటాను. చెట్టు చిగురించాక ఎక్కువ నిడివితో ఉండేలా ఓ సినిమా తీస్తాను. ఈ చెట్టుపై ఇష్టంతోనే గోకులంలో రాధ నవల రాశాను. ఈ కథ అంతా కుమార దైవం ఊళ్లోనే ఆ కథ నడుస్తుంది. చెట్టు, ఈ పరిసరాలే ప్రధానంగా ఉంటాయి. కుమారదైవం ఊరు గురించి ఎవరికీ తెలియదు. ఈ చెట్టు వల్లే ఈ ఊరికి ఇంత పేరు వచ్చింది’’ అని అన్నారాయన(Director Vamsi).

Read Also: తిన్న కంచంలో చెయ్యి కడగకూడదు అంటారు ఎందుకు?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...