తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు… ప్రతీ విషయాన్ని ఆమె తన అభిమానులతో పంచుకుంటారు… అయితే కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన రేణూ తాజాగా ఇస్టా గ్రామ్ లో లైవ్ లోకి వచ్చింది…
నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది… ప్రేమలో విఫలమవడం గురించి ఆమె మాట్లాడుతూ… ప్రేమలో విఫలం అయితే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసు అని చెప్పింది… మనం ఎంత గానో ప్రేమించిన వ్యక్తి మన పక్కనలేడని మనం మోసపోయామని అనిపించినప్పుడు చాలా కష్టంగా ఉంటుందని చెప్పింది…
అయితే ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని చెప్పింది… జీవితం ప్రాణం కంటే ఎక్కువ కాదని చెప్పింది… కౌన్సిలింగ్ తీసుకుంటూ కుటుంబసభ్యులతో కలిసి ఉంటే ఆ బాధ నుంచి బయటపడవచ్చని చెప్పింది…