బాలీవుడ్ కా బాద్ షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఒక కల ఉండేదాని, ఆ కోరికను జవాన్(Jawan), పఠాన్(Pathaan) సినిమాలు తీర్చాయని చెప్పుకొచ్చాడు. గతేడాది అంతా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన షారుఖ్ ఖాన్ తాజాగా ఓ కార్యక్రమంలో తన డ్రీమ్ రోల్స్ గురించి మాట్లాడాడు. అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌ల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కూడా చెప్పాడు. తాను ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు అయినా.. తన కోరికను ఇటీవల వచ్చిన జవాన్, పఠాన్ నెరవేర్చాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ షారుఖ్ కోరిక ఏంటేంటే.. ‘‘ఇప్పటి వరకు ప్రేక్షకులు నన్ను హీరోగానే చూశారు. కానీ హంతకుడి పాత్రలో నటించాలన్నది నా కోరిక. దానిని జవాన్, పఠాన్ నెరవేర్చాయి’’ అని షారుఖ్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రానున్న కాలంలో ఇటువంటి పాత్రల్లో నటించే అవకాశం వస్తే ఎట్టిపరిస్థితుల్లో వదులుకోనంటూ తన ఇంట్రస్ట్ చూపాడు.
అయితే కూతురు సుహానా ఖాన్‌తో(Suhana Khan) కలిసి షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమా ‘కింగ్’. ఇందులో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan).. హంతకుడి పాత్రలో కనిపించనున్నాడంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఇప్పుడు షారుఖ్ మాటలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. మరి రానున్న కాలంలో దీనిపై మూవీ టీమ్ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.