అంటే సుందరానికి రివ్యూ..పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

0
113

శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న న్యాచురల్ స్టార్ నాని తరువాత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా క్రమంలో ఈ యంగ్ హీరో తాజాగా అంటే సుంద‌రానికీ ఒకే చెప్పి మళ్ళి ఫ్యాన్స్ ను ఖుషి చేసాడు. వేక్ ఆత్రేయా ద‌ర్శ‌క‌త్వంలో తెరెకెక్కిన ఈ సినిమాలో నానికి జోడీగా న‌జ్రియా హీరోయిన్‌గా నటించింది.

ఈ చిత్రంలో నాని బ్ర‌హ్మ‌ణుడి పాత్ర‌లో న‌టించ‌గా, న‌జ్రియా క్రిస్టియ‌న్ అమ్మాయిగా న‌టించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో నేడు థియేటర్లలోకి వచ్చింది. ఇటీవలే ఈ చిత్రం ట్రైల‌ర్, టీజ‌ర్‌కు , పాటలకు రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా గురించి పబ్లిక్ ఏమంటున్నారో మీరు కూడా ఓ లుక్కేయండి..

చాలా కాలం తర్వాత నాని మరోసారి కామెడీ చిత్రంతో వస్తుండటంతో ‘అంటే..సుందరానికీ’కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఈ సినిమాలో నాని బ్ర‌హ్మ‌ణుడు, న‌జ్రియా క్రిస్టియ‌న్ కావడంతో ఇద్దరి ఫ్యామిలీలలో వాళ్ల ప్రేమను ఒప్పుకోరు. దీంతో వాళ్ల ప్రేమను ఒప్పించడం కోసం సుందర్ ఏం చేశాడు అనేదే సినిమా. ఓ రొటీన్ కథకు దర్శకుడు వివేక్ రాసుకున్న స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రేక్షకులకు కొంత ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది.

అంటే సుందరానికీ సెకండ్ హాఫ్ బాగుంది అనే టాక్ వినిపించడంతో పాటు..క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. కామెడీ డైలాగ్స్, ఫ్యామిలీ సన్నివేశాలు, స్క్రీన్ ప్లే బాగున్నాయన్న మాట వినిపిస్తోంది. అలాగే నాని, నజ్రియా మధ్య లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు ఆయన గొప్పగా తీర్చిదిద్దారు. వివేక్ సాగర్ సంగీతం బాగుంది అంటున్నారు. ఇక ఈ సినిమాలో మైనస్ విషయానికొస్తే సినిమా కథని కొద్దిగా సాగదీయడం సినిమాకు మైనస్ అయ్యింది. అయితే ఈ సినిమా ఎలాంటి కల్లెక్షన్స్ తమ ఖాతాల్లో వేసుకుంటుందో తెలుసుకోకవాలంటే సాయంత్రం వరకు వేచిచూడాల్సిందే.