Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

-

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంలోనే ఇక సినీ హీరో వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగి.. ఒక మహిళ మరణించి, ఒక బాలుడు కోమాలో ఉండే ఒక్క నటుడు అయినా.. వాళ్ల కుటుంబాన్ని పరామర్శించారా అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఘటనపై స్పందించిన సీఎం సైతం ఈ విషయాన్ని పాయింటౌట్ చేసి మాట్లాడారు.

- Advertisement -

అసలు ఈ ఇండస్ట్రీలో వాళ్లు ఒక్కరైన బాధిత కుటుంబాన్ని పరామర్శించారా, ఒక్క రోజు అరెస్ట్ అయిన అల్లు అర్జున్‌(Allu Arjun)ను మాత్రం ప్రతి ఒక్కరూ వెళ్లి పరామర్శిస్తున్నారు.. ఈ సినిమా వాళ్ల ఆలోచన ఏంటో నాకు తెలియదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విమర్శలపై టాలీవుడ్ విలక్షణ నటుడు, స్టైలిష్ విలన్ జగపతిబాబు(Jagapathi Babu) స్పందించారు. సంధ్య థియేటర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి నేను హాస్పిటల్‌కు వెళ్లాను. పబ్లిసిటీ చేయలేదు కాబట్టే విషయం ఎవరికీ తెలియదు. ఈ మేరకు క్లారిటీ ఇస్తూ జగపతిబాబు ఓ వీడియోను విడుదల చేశారు.

‘‘అందరికీ నమస్కారం. ఒక విషయంపై క్లారిటీ ఇవ్వడానికే ఈ ట్వీట్ చేస్తున్నా. నేను సినిమా షూటింగ్ నుంచి రాగానే.. సంధ్య థియేటర్(Sandhya Theater) బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాను. బాలుడి తండ్రినిి, సోదరిని పలకరించాలని అక్కడకు వెళ్లా. ఆ దేవుడు, అందరి ఆశీస్సులతో త్వరగానే కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చి వచ్చాను. అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ కుటుంబం కాబట్టి.. నావంతు మద్దతు ఇవ్వాలని అనుకున్నా. పబ్లిసిటీ చేయలేదు అందుకే విమర్శలు వచ్చాయి. క్లారిటీ ఇవ్వడానికే ఈ పోస్ట్ చేస్తున్నా’’ అని జగ్గూ భాయ్ తన వీడియోలో వివరించాడు.

Read Also: ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...

Allu Arjun | ‘బాధ్యతగా ఉండండి’.. అభిమానులకు బన్నీ విజ్ఞప్తి

సంధ్య థియేటర్ ఘటన రోజురోజుకు తీవ్ర వివాదంగా మారుతోంది. ఇప్పటికే ఈ...