Allu Arjun | సినిమాలకు ఇక గ్యాప్ ఇవ్వను: బన్నీ

-

‘పుష్ప-2(Pushpa 2)’ సినిమాతో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టడానికి తగ్గేదే లేదంటున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ఫ: దిరైజ్’, ‘పుష్ప: ది రూల్’ సినిమాలకే బన్నీ దాదాపు నాలుగేళ్లు వెచ్చించాడు. దీంతో బన్నీ(Allu Arjun) నుంచి చాలాకాలంగా మరో సినిమా రాకపోవడంతో అభిమానులు కాస్తంత నిరాశలో ఉన్నారు. ఇప్పుడు ‘పుష్ఫ: 2’ రిలీజ్‌కు రెడీ అవుతున్న క్రమంలో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పాడు బన్నీ. కేరళలోని కొచ్చిలో జరిగిన మూవీ ఈవెంట్‌ను తన అప్‌కమింగ్ మూవీ ప్లానింగ్‌కు సంబంధించి మాట్లాడాడు. అభిమానులు బాధపడొద్దని అన్నాడు.

- Advertisement -

‘‘ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. నాలుగేళ్లుగా దీని కోసం శ్రమించా. నాకు, ఫాజిల్ మధ్య సీన్స్ అందరినీ అలరిస్తాయి. ఫాజిల్ నటన మలయాళ ప్రేక్షకులు గర్వపడేలా ఉంది. 20 ఏళ్లుగా నాపై ప్రేమ కురిపిస్తున్న మలయాళ ప్రేక్షకుల కోసం ఈ సినిమాలో ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాం. అదే ఒక పాటను మలయాళ లిరిక్స్‌తో ప్రారంభించడం. అన్ని భాషల్లో కూడా ఇది అలానే ఉంటుంది. అంతేకాకుండా నాలుగేళ్లుగా పుష్ఫలో ఫుల్ బిజీగా ఉన్నా. ఇకపై ఇలా కాదు.. వరుస సినిమాలు చేస్తా. విరామం లేకుండా సినిమాలు చేసి అందరినీ అలరించే ప్రయత్నం చేస్తా. ఇందులో సందేహం అక్కర్లేదు. నా ప్లాన్ అదే. మాట ఇస్తున్నా’’ అని Allu Arjun చెప్పాడు.

Read Also: రోజూ స్పూన్ తేనె తింటే ఏమవుతుందో తెలుసా..?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Rythu Bharosa | ముగిసిన క్యాబినెట్ భేటీ.. రైతు భరోసాపై రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ క్యాబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. అజెండలోని 22 అంశాలపై చర్చించిన...

వణికిస్తున్న HMPV వైరస్.. తెలంగాణ లో కేసులపై స్పందించిన హెల్త్ డైరెక్టర్

చైనాలో పెద్దఎత్తున నమోదవుతున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (HMPV Virus)...