Flash: పునీత్‌ ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

0
86

గతేడాది గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ను ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తాజాగా ఇప్పుడు ఐకాన్​ స్టార్​ అల్లుఅర్జున్​ బెంగళూరులోని పునీత్ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యుల్ని, పునీత్​ అన్న శివరాజ్​కుమార్​ను పరామర్శించారు. ఆయన మరణం పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.