అఖిల్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..సెలబ్రేషన్స్ షురూ!

Icon star Allu Arjun for Akhil..Celebrations start!

0
101

అక్కినేని అఖిల్ తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో హ్యూజ్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఓవర్ సీస్‌లో సైతం బ్యాచ్‌లర్ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతున్నాడు.

ఈ మధ్యనే వైజాగ్ తో నిర్మాతలు థ్యాంక్స్‌మీట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్రాండ్‌సక్సెస్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. దీనికోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు జెఆర్సీ కన్వెన్షన్‌సెంటర్ లో అత్యంత వైభవంగా ఈ ఈవెంట్ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి బన్నీ ఛీఫ్ గెస్ట్ గా విచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

జీఏ2 బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి పూజా హెగ్డే గ్లామర్ హైలైట్ గా నిలిచిపోయింది. మరి అల్లు అర్జున్ రాకతో బ్యాచ్ లర్ గ్రాండ్‌సక్సెస్ ఈవెంట్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.