ఫ్యాన్స్ కు పండగే..’ఢీ’ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Icon star Allu Arjun for 'Dhee' show

0
111

దక్షిణాదిలోనే అతిపెద్ద డ్యాన్స్‌ రియాల్టీ షో ‘ఢీ’. కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌ కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ సీజన్‌ ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించింది. ఢీ 13వ సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. ఈ డ్యాన్స్‌ షో గ్రాండ్‌ఫినాలేకు ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్‌ ఎంట్రీకి సంబంధించిన ఓ సరికొత్త ప్రోమోని ‘ఢీ’ టీమ్‌ విడుదల చేసింది.

పుష్ప’ చిత్రంలోని ‘ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా’ పాటతో బన్నీ సూపర్‌ ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు, ‘ఆర్య 2’ సమయంలో జరిగిన ‘ఢీ 3′ గ్రాండ్‌ఫినాలేకు బన్నీ-సుకుమార్‌ కలిసి విచ్చేశారు. ఇప్పుడు సరిగ్గా పది సీజన్ల తర్వాత బన్నీ ఈ సీజన్‌కు మళ్లీ గెస్ట్‌గా రావడం ఎంతో ఆనందంగా ఉందని అభిమానులు పేర్కొంటున్నారు.

ఢీ’ విషయానికి వస్తే..ప్రతి బుధవారం  ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోకు ప్రియమణి, గణేశ్‌ మాస్టర్‌, పూర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. సుధీర్‌-హైపర్‌ ఆది, రష్మి-దీపిక టీమ్‌ లీడర్లుగా, ప్రదీప్‌ వ్యాఖ్యాతగా అలరిస్తున్నారు.