చిక్కుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..అసలు ఏం జరిగిందంటే?

Icon star Allu Arjun in trouble..what actually happened?

0
101

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఇటీవల నటించిన ర్యాపిడో యాడ్‌పై తెలంగాణ ఆర్టీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అందులో ఆర్టీసీ బస్సులను తక్కువ చేసి చూపించడం, కించపరచడాన్ని తప్పుబడుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అల్లు అర్జున్‌తో పాటు ఈ యాడ్‌ రూపొందించిన ర్యాపిడో కంపెనీకి లీగల్ నోటీసులు పంపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోన్న టీఎస్‌ఆర్‌టీసీని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యంతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులు, అభిమానులు ఎవరూ సహించరని ఆయన ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల హోదాలో ఉన్న నటీనటులు, సెలబ్రిటీలు, వివిధ రంగాల ప్రముఖులు ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

ర్యాపిడో రూపొందించిన ఈ ప్రకటనలో అల్లు అర్జున్‌ దోసెలు వేస్తూ ‘అబ్బాయి దోసెలు తినాలంటే రెండే చోట్ల..ఒకటి తన దగ్గర..రెండోది ఆ ఆర్టీసీ బస్సు రూట్లోనే’ అంటూ బస్సును చూపిస్తాడు. ఆతర్వాత ‘అక్కడ మామూలు దోసెలా ఎక్కినోన్ని కూడా కూర్మా, ఖైమా కొట్టి మసాలా దోసె చేసి దింపుతారు’ అంటూ ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో ప్రయాణం చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని అర్థం వచ్చేలా మాట్లాడతాడు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులను ఎక్కిన ప్రయాణికులను మసాలా దోసెలతో పోల్చడాన్ని టీఎస్‌ఆర్టీసీ తప్పుపట్టింది. ఈక్రమంలోనే అర్జున్‌తో పాటు ర్యాపిడోకు లీగల్‌ నోటీసులు పంపించారు ఎండీ సజ్జనార్‌.

ఆ యాడ్ చూడడానికి ఈ లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=lyEdUcEa_g8