బాలీవుడ్ ఎంట్రీపై ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు

Icon star Allu Arjun interesting comments on Bollywood entry

0
136

‘పుష్ప’ ప్రచారంలో భాగంగా గురువారం ముంబయి వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హిందీ సినిమాల్లో తన ఎంట్రీ గురించి మరోసారి మాట్లాడారు. బాలీవుడ్​ నుంచి ఇప్పటికే తనకు చాలా ఆఫర్స్ వచ్చాయని, కానీ సరైన కథ కోసం వేచిచూస్తున్నానని బన్ని చెప్పుకొచ్చాడు.

నాకు హిందీ సినిమాలంటే ఇష్టం. వాటిని చూస్తూనే పెరిగాను. కచ్చితంగా బాలీవుడ్​లో నేరుగా సినిమా చేస్తాను. అది నా కెరీర్​లోనే ల్యాండ్​మార్క్​ ఫిల్మ్ అవుతుంది. అందుకే అది ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పటికే కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ అవేవి అంత ఆసక్తిగా అనిపించలేదు. అన్ని సరిగ్గా కుదిరితే మాత్రం హిందీలో నా నుంచి భారీ సినిమా వస్తుంది” అని హీరో అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు.

అల్లుఅర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ తొలిభాగం డిసెంబరు 17న పాన్ ఇండియా రేంజ్​లో రిలీజ్ కానుంది. ఇందులో రష్మిక హీరోయిన్. ఫహాద్ ఫాజిల్ కీలకపాత్ర పోషించారు. సునీల్, అనసూయ ప్రతినాయకులుగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు.