ఐకాన్ స్టార్ కొత్త థియేటర్ ‘AAA సినిమాస్’

Icon Star New Theater 'AAA Cinemas'

0
99

నటనే కాదు, వ్యాపార రంగంలోనూ తమదైన ముద్రవేయాలని తెలుగు సినీ హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల విజయ్‌ దేవరకొండ మూవీ థియేటర్స్‌ను ప్రారంభించగా, త్వరలో అల్లు అర్జున్‌ కూడా అదే బాటలో పయనించనున్నారు. ‘AAA’ సినిమాస్‌ పేరుతో అందుబాటులోకి తీసుకొస్తున్న థియేటర్‌కు శనివారం బన్నీ పూజా కార్యక్రమం నిర్వహించారు.

నిర్మాత సునీల్‌ నారంగ్‌, నారాయణ దాస్‌లు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సరికొత్త టెక్నాలజీతో హైదరాబాద్‌లోని అమీర్​పేట్​లో ఈ థియేటర్‌ అందుబాటులోకి రానుంది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. డిసెంబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి చేసిన చిత్రబృందం..ప్రస్తుతం ఓ అదిరిపోయే సాంగ్​ను షూట్ చేస్తోంది. ఈ పాటను 1000 మంది డ్యాన్సర్లతో రూపొందిస్తుండటం విశేషం. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘సామి సామి’, ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’ పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.