శంకర్‌పల్లిలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ సందడి

Allu Arjun comes to Emaruo office..do you know why?

0
102

తెలంగాణ: రంగారెడ్డి జిల్లా చేవేళ్లలోని శంకర్‌పల్లిలో సినీ హీరో, ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ సందడి చేశారు. జన్వాడ గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని అల్లు అర్జున్ ఇటీవల కొనుగోలు చేశారు. కాగా, ఈ భూమి రిజిస్ట్రేషన్‌ పనుల నిమిత్తం శుక్రవారం ఆయన శంకర్‌పల్లి ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు.

బన్నీ రాక గురించి తెలుసుకున్న అభిమానులు ఎమ్మార్వో కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ఆయనతో ఫొటోలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తైన వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు.