ఎఫ్ 3 హిట్ కాకపోతే మళ్ళీ కనపడను..ప్రముఖ నటుడు కీలక వ్యాఖ్యలు

0
120

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ సినిమాలో హీరోల సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఎఫ్ 2 పోయిన 2019 సంక్రాంతికి విడుదలైన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరెక్కిస్తున్నాడు.

ఎఫ్2 మూవీలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తమదైన శైలిలో నటించి భారీ విజయాన్ని సాధించారు. దాంతో ఎఫ్ 3 కూడా తీయాలని నిర్ణయించినుకొని ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమా భారీ అంచనాలతో మే 27వ తేదీన విడుదలై ధీయేటర్లలో సందడి చేయనున్న క్రమంలో తాజాగా శనివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఎఫ్3 ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్3 చిత్రబృందం మొత్తం హాజరయ్యారు. ఈ సందర్బంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా సమాజానికి ఎంతో అవసరమని నవ్వుతో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. అయితే ఈ మూవీ హిట్ కాకపోతే గుండెల మీద చెయ్యి వేసుకొని చెపుతున్న మళ్ళీ మీ ముందు నేను ఎప్పుడూ నిలబడను, మీకు కనపడను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.