ఓటీటీ వేదిక ఆహాలో సమంత నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో సామ్జామ్ అదరహో అనిపిస్తుంది, సెలబ్రెటీలతో సందడి చేస్తోంది అందాల తార సమంత, తాజాగా మెగాస్టార్ చిరంజీవి సమంత షోకి వచ్చారు, క్రిస్మస్ సందర్భంగా ఈ కార్యక్రమం ఆహాలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ సమయంలో చాలా ప్రశ్నలు వేసింది సమంత. అన్నీంటకి ఆయన సరదాగా సమాధానాలు చెప్పారు.
అయితే ఈ సమయంలో మీరు చేసిన సూపర్ హిట్ సినిమాలు ఎవరు రీమేక్ చేస్తే బాగుంటుంది అని కూడా అడిగింది సమంత..
దీనికి స్పందించిన మెగాస్టార్ వాటిపై సమాధానం చెప్పారు..ఆయన నటించిన చిత్రాల్లో మొదటిగా జగదీకవీరుడు.. అతిలోకసుందరి ఇది రామ్ చరణ్ లేదా ప్రిన్స్ మహేష్ బాబుకి సెట్ అవుతుంది అన్నారు, ఇక అతిలోకసుందరిగా సమంత బాగుంటుంది అని అన్నారు, ఇక ప్రభాస్ ఇంద్ర సినిమా చేస్తే బాగుంటుంది, పవన్ కల్యాణ్ ఠాగూర్ సినిమా సెట్ అవుతుంది.
ఛాలెంజ్ సినిమాకు బన్నీ లేదా విజయ్ దేవరకొండ పేర్లు సూచించారు. ఇక గ్యాంగ్ లీడర్ తారక్ లేదా చరణ్ కి సెట్ అవుతుంది, ఇక రౌడీ అల్లుడు రవితేజ చేస్తే బాగుంటుంది… అలాగే విజేత సినిమాలో పాత్ర నాగచైతన్యకు సెట్ అవుతుంది అని చెప్పారు చిరు.