కల్కి సినిమాలో ‘యాస్కిన్’ పాత్రకు సెకండ్ ఆప్షన్ అతడే..

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మరోసారి వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ‘కల్కి(Kalki)’. ఈ సినిమాలో భైరవ పాత్ర ఎంత ఫేమస్ అయిందో.. అదే స్థాయిలో విశ్వనటుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన ‘యాస్కిన్’ పాత్రకు ఆదరణ లభించింది. తాజాగా ఈ యాస్కిన్ పాత్రకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయంలో సినీ సర్కాల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పాత్రకు కమల్ హాసన్ నో చెప్పి ఉంటే ఈ పాత్రలో ఎవరు నటించి ఉండేవారు? యాస్కిన్ పాత్రకు సెకండ్ ఆప్షన్ ఎవరు? అనేదే హాట్ టాపిక్‌గా ఉంది. ఈ క్రమంలోనే ఈ ప్రశ్నలకు ‘కల్కి’ మూవీ టీమ్‌కు చెందిన ఓ ఆర్టిస్ట్ చెప్పిన సమాధానం అంతకుమించి రంజుగా మారింది.

- Advertisement -

‘యాస్కిన్ పాత్ర కోసం డైరెక్ట్‌ కమల్‌(Kamal Haasan)నే అడిగాం. ఆయన వెంటనే ఓకే చేయలేదు. కాస్త సమయం కావాలని అడిగారు. దీంతో ఒకవేళ ఆయన నో చెప్తే.. సెకండ్ ఆప్షన్ ఉండాలి కదా అని ఆలోచించాం. ఆ క్రమంలోనే యాస్కిన్ పాత్రకు కమల్ కుదరదంటే మోహన్‌లాల్‌ను సంప్రదించాలని రెడీ అయ్యాం. చివరికి కమల్ ఓకే చెప్పారు. చిత్రబృందం కూడా కమల్‌ పర్ఫెక్స్ అంది. ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉందో ఇప్పుడు కనిపిస్తూనే ఉంది’’ అని చెప్పారు.

Read Also: యామినీ కృష్ణమూర్తి ఇకలేరు..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...