‘అంటే సుంద‌రానికీ’ మూవీకి న‌జ్రియా రెమ్యున‌రేష‌న్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?

0
86

‘రాజారాణి’ మూవీతో ప్రేక్షకులకు పరిచయమైనా న‌జ్రియా న‌జిమ్‌ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాలో న‌జ్రియా తనదైన శైలిలో నటించి కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. కానీ ఆ సినిమా తరువాత న‌జ్రియా తెలుగులో ఎలాంటి సినిమాకు ఒకే చెప్పకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

ఇలాంటి క్రమంలో ప్రేక్షకులందరూ అందరు ఎదురుచూసిన విధంగానే ‘అంటే సుంద‌రానికీ’  ఒకే చెప్పి కథనాయకిగా నటించింది. తాజాగా ఈ చిత్రంలో న‌జ్రియా న‌జిమ్‌ రెమ్యున‌రేష‌న్ ఎంత తీసూకుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో నాని బ్ర‌హ్మ‌ణుడి పాత్ర‌లో న‌టించ‌గా, న‌జ్రియా క్రిస్టియ‌న్ అమ్మాయిగా నటించి మనందరికీ ఆకట్టుకుంది.

భారీ అంచ‌నాల న‌డుమ జూన్ 10న‌ విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఫ‌స్ట్ వీకెండ్ పూర్త‌య్యే సరికి ఈ చిత్రం దాదాపు రూ.15 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. ఈ చిత్రంలో న‌జ్రియా ఏకంగా రూ.2 కోట్ల పరితోషికం తీసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. కానీ ఈ వార్తలో ఎంత వరకు వాస్తవముందనేది తెలియాల్సి ఉంది.