క్యాస్టింగ్ కౌచ్ అంశం గురించి దేశంలో ఎంత పెద్ద ఎత్తున చర్చ జరిగిందో తెలిసిందే, ఇలాంటి వేధింపులకి గురిచేసిన వారి పరువు తీసి బయటపెట్టారు, అంతేకాదు తమకు అవకాశాలు ఇవ్వాలి అంటే వారు కోరిక కోరికలు వారి డిమాండ్లు మీడియా ముఖంగా బయటపెట్టారు, ఇలా పలువురు నిర్మాతలు దర్శకులు హీరోల పేర్లు బయటపెట్టారు హీరోయిన్లు మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులు.
అయితే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఈ వివాదం నడిచింది, ఇలా అన్నీ చిత్ర సీమల్లో ఇలాంటి వారు బయటపడ్డారు..
సుశాంత్సింగ్ రాజ్పుత్ మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండే దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను జాతీయ మీడియాతో పంచుకుంది. ఇప్పుడు ఈ అంశం గురించి చర్చించుకుంటున్నారు.
ఆమె వయసు 20 సంవత్సరాలు ఉన్న సమయంలో చిత్ర సీమలోకి వచ్చింది, అయితే ఆమె కు సౌత్ ఇండియా నుంచి ఓ ఆఫర్ వచ్చింది…ఒక స్టార్ హీరో నన్ను గదిలోకి పిలిచి కంప్రమైజ్ అవుతావా అని అడిగాడు.మీ నిర్మాతకు ఎలాంటి కంప్రమైజ్ కావాలి… నేనేమైనా అతనితో పార్టీలకు, డిన్నర్లకు రావాలా అని అడిగా ఆయన సైలెంట్ అయ్యాడు, ఏమీ మాట్లాడలేదు, నేనుషేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చేశాను అని చెప్పింది. మరి ఆ స్టార్ హీరో నిర్మాత ఎవరో వారి పేర్లు వెల్లడించలేదు.