కృష్ణంరాజు ఆస్తి ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

0
106

ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న తెల్లవారుజామున కన్నుమూశారు. కాగా కృష్ణంరాజు అంత్యక్రియలు నేడు (సోమవారం) చేవెళ్ల, మొయినాబాద్ వద్ద కనకమామిడి ఫామ్ హౌస్ లో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా నెటిజన్లు కృష్ణంరాజుకు సంబంధించిన విషయాలపై తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆయన సినిమాలు, వ్యక్తిగత విషయాలు, ఆస్తులపై విపరీతంగా శోధిస్తున్నారు. ఇక కృష్ణం రాజుకు ఉన్న ఆస్తులపై ఓ లుక్కేద్దాం..

తల్లిదండ్రుల వారసత్వంగా సొంతూరిలో వందల ఎకరాల భూమి కృష్ణంరాజుకు వచ్చింది.
అక్కడ ఓ భవనంతో పాటు చెన్నై, హైదరాబాద్​లో కృష్ణంరాజుకు నాలుగు ఖరీదైన ఇళ్లు ఉన్నాయట. ప్రస్తుతం జూబ్లీహిల్స్​లో నివాసముంటున్న బిల్డింగ్ ఖరీదు రూ.18 కోట్ల వరకు ఉంటుందని అంచనా. హైదరాబాద్​లో కృష్ణంరాజుకు ఫామ్ హౌస్ కూడా ఉందట.

అలాగే ఇప్పుడు కృష్ణంరాజు వద్ద రూ.90 లక్షల విలువైన మెర్సిడెజ్ బెంజ్, రూ.40 లక్షల విలువైన టొయోటా ఫార్చునర్, రూ.90 లక్షల ఖరీదైన వోల్వో ఎక్స్ సీ కార్లు ఉన్నాయి. 2009 లోక్ సభ ఎన్నికల్లో కృష్ణంరాజు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడివిట్ ప్రకారం.. తన కుటుంబానికి రూ.8.62 కోట్ల ఆస్తులు, రూ.2.14 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపించారు. అయితే ఆ ఆస్తుల విలువ ఇప్పుడు పెరిగి ఉంటుంది.దీని ప్రకారం ఆయన మొత్తం ఆస్తి విలువ రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.