ఇల్లి బ్రేకప్‌ చెప్పిందా?

ఇల్లి బ్రేకప్‌ చెప్పిందా?

0
87

ఆండ్రూ నీబోన్‌ అనే ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ప్రేమలో సినీ నటి ఇలియానా మునిగి తేలిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలసి దిగిన ఎన్నో ఫొటోలు సోషల్‌ మీడియాను షేక్‌ చేశాయి. అయితే, వీరి ప్రేమ వ్యవహారం అటకెక్కిందనే వార్తలు ఇప్పుడు షికారు చేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్‌ లో వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ ఫాలో కావడమే దీనికి కారణం. అంతేకాదు, ఇద్దరూ కలసి ఉన్న ఫొటోలను కూడా ఆండ్రూ డిలీట్‌ చేశాడు.

ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని… అందుకే విడిపోయారని బీటౌన్‌ లో అనుకుంటున్నారు.
2017లో తన క్రిస్మస్‌ పోస్ట్‌ లో అండ్రూ నీబోన్‌ ను తనకు కాబోయే భర్త అంటూ ఇలియానా వెల్లడించింది. అంతకు మించి తమ రిలేషన్‌ షిప్‌ గురించి ఆమె ఎక్కడా మాట్లాడలేదు.

ఒక విదేశీయుడితో తాను డేటింగ్‌ చేస్తున్నానని గత ఏడాది ఆమె ప్రకటించింది. జులై 19న తన ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఇంతలోనే ఏం జరిగిందో కానీ ఒకరికొకరు దూరమయ్యారు.