ఆస్కార్ నామినేషన్స్ లో ఇండియన్ సినిమా..!!

ఆస్కార్ నామినేషన్స్ లో ఇండియన్ సినిమా..!!

0
100

ఆస్కార్ నామినేషన్ లోకి సినిమా వెళ్లిందంటే చాలు ఆస్కార్ వచ్చినట్లు ఫీల్ అవుతుంటారు.. అయితే ఆస్కార్ వస్తే ఇంకేమన్నా ఉందా.. అప్పుడెప్పుడో స్లం డాగ్ మిలినియర్ సినిమా తర్వాత ఏ ఇండియన్ సినిమా కి ఆస్కార్ అవార్డు రాలేదు.. పలు సినిమాలు నామినేషన్స్ దాకా వెళ్లినా ఏ సినిమా కూడా అవార్డు గెలుచుకోలేదు.

సినిమా ఇండస్ట్రీ లో ఉత్తమ అవార్డు గా పేరున్న ఆస్కార్ లోకి ఈ సంవత్సరం ఓ ఇండియన్ సినిమా నామినేట్ అయ్యింది.రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘గల్లీ బాయ్’ ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్‌కి అఫీషియల్ ఎంట్రీగా నామినేట్ అయ్యింది. జోయా అఖ్తర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఈ సినిమా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం క్యాటగిరీలో నామినేట్ అయింది. దీనిపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘గల్లీ బాయ్’ సినిమాను హాలీవుడ్ సినిమాల ప్రేరణగా తీసుకోని తెరకెక్కించారని పలువురు ఆరోపిస్తున్నారు.